Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*అమరావతి: నేడు టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల.. ఉదయం 11 గంటల తర్వాత జాబితాను విడుదల చేయనున్న చంద్రబాబు, పవన్‌.. 60-70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న చంద్రబాబు, పవన్‌.. 50కు పైగా టీడీపీ, 10కి పైగా జనసేన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం.

*నేడు ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ.. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌లకు ధరణిలో తప్పులు సరిదిద్దే అధికారాలపై చర్చ.. ధరణి వెబ్‌సైట్‌ ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం.. ధరణి అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం.

*నేడు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర.. పాల్గొననున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పురుషోత్తం రూపాలా.. మధ్యాహ్నం 1 గంటలకు ఓల్డ్‌ బస్టాండ్‌లో బహిరంగ సభ..

*విజయవాడ: నేడు బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం.. హాజరుకానున్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి

*విజయనగరం జిల్లా: నేడు బొబ్బిలిలో పర్యటించనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. కోర్టు నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కోసం కోర్టు ప్రాంగణాన్ని చేరుకోనున్న ప్రధాన న్యాయమూర్తి.

*విజయవాడ: నేడు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

*తిరుమల: ఇవాళ కుమారధార తీర్థ ముక్కోటి.. మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు అనుమతి.. సాయంత్రం పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.

*తిరుమల: ఇవాళ ఆన్ లైన్‌లో మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను విడుదల

*నేటికి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి రెండేళ్లు

*తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,720.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.75,900.

Exit mobile version