*ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగనున్న మంత్రి మండలి సమావేశం.. ఉదయం 8 గంటలకు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌లో సమావేశం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్.
*అమరావతి: ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ.. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం.. ఉదయం 11.03 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.. మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024.. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024.
*ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్న చంద్రబాబు.. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీ రమ్మని చంద్రబాబుకి అమిత్ షా ఆహ్వానం.. ఈ రాత్రికి అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ కానున్న చంద్రబాబు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్.. చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం.. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని హైకమాండుకు ఇప్పటికే మెజార్టీ ఏపీ బీజేపీ నేతల సూచన.
*తిరుమల: ఇవాళ పురంధరదాసు ఆరాధన మహోత్సవం.. కళ్యాణ వేదికలో 300 కళాకారులుతో శ్రీవేంకటేశ్వర నవరత్నమాలిక గోష్టి గానం నిర్వహిస్తున్న టీటీడీ.
*నంద్యాల: నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం.. సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కెఆర్ఎంబి బృందం సభ్యులు
*హైదరాబాద్: నేడు టీఎస్ ఐఐసీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో ధరణి కమిటీ భేటీ.. ఉదయం 10 :30 నుంచి సాయంత్రం వరకు సెక్రటేరియట్‌లో సమావేశం.
*ఖమ్మం జిల్లాలో నేడు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన.. స్నానాల లక్ష్మి పురంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు మల్లు అనంత రాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న భట్టి విక్రమార్క
*ఖమ్మం: నేడు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన… తీర్థాలలో శివరాత్రి ఉత్సవాల పై సమీక్ష
*నేడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్న కిషన్ రెడ్డి
*తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం దివాన్ చెరువు ఆవదూత పీఠం వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్ఫాటుకు శంకుస్థాపన.. గణపతి సచ్చిదానంద స్వామీజీ అమృత హస్తాలతో విగ్రహ శంకుస్థాపన.. సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో విగ్రహ ఏర్పాటు.. హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు
*నేడు ఎన్నికల కమిషనర్ ఎంపికపై ప్రధాని మోడీ నేతృత్వంలోని కమిటీ భేటీ
