Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*కర్నూలు: నేడు పత్తికొండలో చంద్రబాబు పర్యటన.. మ.3 గంటలకు రా..కదలిరా బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.. నేడు పత్తికొండలో బస చేయనున్న చంద్రబాబు.

*పాట్నా: ఉదయం 10 గంటలకు జేడీఎల్పీ సమావేశం.. సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్‌కుమార్.. గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్న నితీష్‌కుమార్.. 9వ సారి బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్.. సాయంత్రం 4గంటలకు బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్న నితీష్.. బీజేపీకి రెండు డిప్యూటీ సీఎంలు, స్పీకర్‌ పదవి.. రేణుదేవి, సుశీల్‌మోడీలకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం.. నేడు పాట్నాకు అమిత్‌షా, జేపీ నడ్డా.

*నేడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన.. గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించనున్న సీతక్క.. అనంతరం మేడారంలో జరుగుతున్న పనులను పరిశీలించనున్న మంత్రి.

*నేడు తిరుపతిలో వైఎస్ షర్మిల పర్యటన.. ఉదయం 10 నుంచి 12 వరకు నగరంలోని రామతులసి కళ్యాణ మండపంలో తిరుపతి, చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం.. షర్మిల రాక సందర్భంగా భారీ స్వాగతం పలుకుతూ కటౌట్లు ఏర్పాట్లు.

*తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో భారీ హిందూ సాగమం.. కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణనందస్వామి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు.. శ్రీరామ ఉత్సవ సమితి పర్యవేక్షణలో ఏర్పాట్లు.

*నేడు గుంటూరులో పర్యటించనున్న ఎంపీ గల్లా జయదేవ్.. తన రాజకీయ విరామంపై క్లారిటీ ఇవ్వనున్న ఎంపీ జయదేవ్..
అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సభ నిర్వహించనున్న జయదేవ్.

*శ్రీ సత్యసాయి జిల్లా: నేడు పెనుకొండ మండలంలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్.. మండలంలో ఆత్మీయ పలకరింపు పేరుతో కార్యకర్తలను కలుస్తున్న మంత్రి.

*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,950.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.77,500.

Exit mobile version