NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేడు ముక్కోటి ఏకాదశి.. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తజనం

*తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం.. ఇవాళ ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రేపు ఉదయం 4 గంటలకు ద్వాదశి పుష్కరిణిలో చక్రస్నానం.. తిరుమలకు పెరిగిన వీఐపీల తాకిడి.. క్యూ కడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మె్ల్సీలు.

*తిరుమల: నేటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో కిలోమీటర్ల పొడవునా భక్తుల క్యూలు.

*ఏలూరు : ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న దర్శించుకుంటున్న భక్తులు.. గోవింద నామస్మరణలతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం.. ఉచిత దర్శనం, రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు.. గోవింద స్వాములకు, గ్రామస్థులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు

*శ్రీకాకుళం: ముక్కోటి ఏకాదశి సందర్బంగా అరసవల్లి , నారాయణ తిరుమలలో స్వామి వార్ల ఉత్తరద్వార దర్శనం.. ప్రత్యేక అలంకరణలతో దర్శనం ఇస్తున్న సూర్యనారాయణ స్వామి.

*యాదాద్రి జిల్లా: ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి.. స్వామి వారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు.

*భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి దర్శనం శ్రీరామచంద్రస్వామి.. భారీగా తరలి వచ్చిన భక్తులు

*హైదరాబాద్‌: నేడు వాస్తవ తెలంగాణ పేరుతో స్వేదపత్రం విడుదలకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్.. నేడు తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదపై ప్రజెంటేషన్.. వివరాలు ఎక్స్‌(ట్విటర్‌)లో వెల్లడించిన మాజీ మంత్రి కేటీఆర్‌.

*తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,230.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,000.

*ప్రొకబడ్డీలో నేటి మ్యాచ్‌లు.. రాత్రి 8 గంటలకు తమిళ తలైవాస్‌ వర్సెస్‌ జైపూర్‌.. రాత్రి 9 గంటలకు గుజరాత్‌ వర్సెస్ యూపీ.

Show comments