*తిరుమల: రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. నేటి మ.2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు విక్రయం.. తిరుపతిలోని 10 కౌంటర్ల దగ్గర ద్వార దర్శనం టోకెన్లు జారీ.. 10 రోజులకు సంబంధించిన 4.25 లక్షల టోకెన్లకు భక్తులకు కేటాయింపు.. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి.. నేటి అర్ధరాత్రి తర్వాత శ్రీవారి వైకుంఠ ద్వారాలను తెరవనున్న టీటీడీ.
*విజయవాడ: నేడు, రేపు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెమినార్.. ఏపీలో ఎన్నికల సన్నద్ధత ఓటర్ జాబితా సవరణపై చర్చ.. పాల్గొననున్న రాష్ట్ర ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు.
*అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు మండపేటలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర.. మధ్యాహ్నం మూడు గంటలకు పట్టణంలో భారీ ర్యాలీ.. అనంతరం మండపేట కలువ పువ్వు సెంటర్‌లో భారీ బహిరంగ సభ.. బస్సు యాత్రకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు
*కర్నూలు: నేడు ఎమ్మిగనూరులో వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. పాల్గొననున్న మంత్రులు గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, ఎంపీ సంజీవ్ కుమార్, మాజీ ఎంపీ బుట్టా రేణుక
*అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించిన పోలీసులు.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టిన పోలీసులు.. అయితే మావోయిస్టుల డిమాండ్స్‌పై ఇంకా రాని సమాచారం.
*తూర్పుగోదావరి జిల్లా: నేడు భారత పార్లమెంట్‌లో ఆగంతకులు పొగ బాంబులతో అలజడి సృష్టించాడని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఆందోళన.. విపక్ష పార్లమెంటు సభ్యులను 141 మందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
*ఛత్తీస్‌గఢ్ కేబినెట్ మంత్రులుగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నేడు ప్రమాణ స్వీకారం
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,000.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,750.. రూ.500 పెరిగి రూ.80,700లకు చేరిన కిలో వెండి ధర.