*హైదరాబాద్: నేటి నుంచి శాసనసభ సమావేశాలు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం సిద్ధం.. ఆర్థిక స్థితిగతి, సాగునీరు, విద్యుత్ రంగాలపై చర్చ తో సమావేశాలు ముగించాలని నిర్ణయం.
*ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. నేరుగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్న సీఎం.
*అమరావతి: నేడు సీఎం జగన్ వరుస కార్యక్రమాలు.. నేడు ఉ.11గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమం.. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న జగన్.. అనంతరం సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలు ప్రారంభించనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.. సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్.
*విజయనగరం: నేడే యువగళం విజయోత్సవ సభ.. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్న టీడీపీ శ్రేణులు.. హాజరవనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇరు పార్టీల శ్రేణులు.. పాల్గొననున్న టీడీపీ, జనసేన శ్రేణులు
*విశాఖ: నేడు నగరానికి రానున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. పొలిపల్లి దగ్గర టీడీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొననున్న పవన్
*నేడు భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా బల రామావతారంలో దర్శనం ఇవ్వనున్న స్వామి వారు.