Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. తిరుపతి అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారిలో ఐరన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలనే పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ. హైకోర్టులో టీటీడీ మాజీ మెంబర్‌ భానుప్రకాష్‌ రెడ్డి పిటిషన్‌.

2. విజయవాడ : నేడు, రేపు డాక్యుమెంట్ రైటర్స్‌ అసోసియేషన్‌ పెన్‌ డౌన్‌. రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రైమ్‌కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌ విధానం వద్దని నిరసన.

3. నేటి నుంచి ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం. సెప్టెంబర్ 2న భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌. సెప్టెంబర్‌ 17న ఫైనల్స్‌తో ముగియనున్న ఆసియా కప్‌.

4. నేడు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ మంత్రుల పర్యటన. షోలాపూర్‌ మార్కండేయ రథోత్సవ కార్యక్రమం. పాల్గొననున్న మంత్రులు హరీష్‌రావు, మహమూద్‌ అలీ. షోల్‌పూర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల పరిశీలన.

5. ద్వారకాతిరుమలలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు. నేడు పవిత్రాది వాసం, రేపు పవిత్రావరోహణ. సెప్టెంబర్‌ 1న పూర్ణాహుతితో ఉత్సవాల ముగింపు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు.

6. నేడు హైదరాబాద్‌ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,670 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,000 లుగా ఉంది.

7. మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ రాఖీ స్పెషల్‌. నేడు, రేపు ప్రయాణించే మహిళలకు బహుమతులు. రీజియన్‌ పరిధిలో ముగ్గురు చొప్పున 33 మంది ఎంపిక. సెప్టెంబర్ 9న విజేతలను ప్రకటించనున్న టీఎస్ఆర్టీసీ.

8. నేడు బీజేపీలోకి విద్యాసాగర్‌రావు తనయుడు డా.వికాస్‌. వేములవాడ నుంచి హైదరాబాద్‌కు భారీ ర్యాలీ. వేములవాడ టికెట్‌ ఆశిస్తున్న డాక్టర్‌ వికాస్‌.

Exit mobile version