Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ .. నేడు విచారణ చేయనున్న న్యాయస్థానం.. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు

*అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్.. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం లో ఇప్పటికే నారాయణకు మెడికల్ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు.. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ చేయనున్న న్యాయస్థానం.. తుది విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు

*నేడు ఇద్దరు కలిసి తొలిసారి ఒకే పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించనున్న బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కానున్న బాలయ్య, పవన్, లోకేష్.. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా సెంట్రల్ జైలుకి రానున్న జనసేన అధినేత.. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకి రానున్న బాలయ్య, లోకేష్.. ములాఖత్ తర్వాత జైలు దగ్గర మీడియాతో మాట్లాడనున్న నేతలు

*నేడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రత పెంపు

*నేడు 5వ రోజుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్

*హైదరాబాద్‌: నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు బీజేపీ పిలుపు.. కిషన్‌ రెడ్డి దీక్ష భగ్నంపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపు.

*నేడు ఖమ్మం మెడికల్ కళాశాలను ప్రారంభించనున్న మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్‌లు

*ఆదిలాబాద్: నేడు పొలాల అమావాస్య.. ఉమ్మడి జిల్లాలో ఇవ్వాళ కాడెద్దులకు నైవేద్యం పెట్టి పూజ చేయనున్న రైతు కుటుంబాలు.. బసవన్నలను అందంగా ముస్తాబు చేసి తమ తమ గ్రామాల్లోని ఆలయం చుట్టూ డప్పుల చప్పుళ్లతో తిప్పనున్న రైతులు.

*ఆసియా: నేడు శ్రీలంకతో తలపడనున్న పాకిస్తాన్‌.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్

Exit mobile version