Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

విజయవాడ: నేడు పీఎస్‌ఆర్‌ను సీఐడీ కస్టడీకి తీసుకునే ఛాన్స్‌. నిన్నటి నుంచే సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినా.. నేడు మరోసారి వైద్యపరీక్షలు చేసి సీబీఐ కస్టడీకి తీసుకునే అవకాశం.

చిత్తూరు: నేడు తుని మున్సిపల్‌ చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌ ఎన్నిక. టీడీపీకి 17, వైసీపీకి 11 మంది మద్దతు. టీడీపీకి రెండు పదవులు ఏకగ్రీవం అయ్యే అవకాశం. ఎన్నికల్లో వైసీపీ పాల్గొనడంపై సందిగ్ధత.

చిత్తూరు: నేడు కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక. వైసీపీకి చెందిన సుధీర్‌ రాజీనామాతో ఖాళీ అయిన పదవి. ఇప్పటికే టీడీపీలో చేరిన నలుగురు వైసీపీ కౌన్సిలర్లు. ఎక్స్‌అఫీషియోతో కలిపి టీడీపీకి 11 మంది కౌన్సిలర్లు. ఎక్స్‌అఫీషియో సభ్యుడితో కలిపి వైసీపీకి 15 ఓట్లు. చైర్మన్‌ ఎన్నికలో గెలవాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 14 ఓట్లు.

మే2న రాజధాని అమరావతి పునర్‌నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం. నేడు రాజధాని పునర్‌నిర్మాణ కార్యక్రమానికి ఆహ్వానితులపై సీఎం సమీక్ష. పత్రిపక్ష పార్టీల ఆహ్వానంపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు. నేడు ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌.

ఐపీఎల్‌: నేడు రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనున్న గుజరాత్‌ టైటాన్స్‌. సాయంత్రం 7.30 గంటలకు జైపూర్‌ వేదికగా మ్యాచ్‌.

విశాఖ: నేడు జీవీఎంసీ నూతన మేయర్‌ ఎన్నిక. కౌన్సిల్‌లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన కూటమి. నేడు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్న టీడీపీ మేయర్‌.

అమరావతి: నేడు లిక్కర్‌ స్కాం కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ. రాజ్‌కేసిరెడ్డి రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ కేసిరెడ్డి తండ్రి ఉపేంద్రరెడ్డి పిటిషన్‌. లిక్కర్‌ స్కాం కేసులో ఏ1 కేసిరెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ.

అమరావతి: నటి జత్వానీ వేధింపుల కేసు క్వాష్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ.

పల్నాడు: నేడు మాచర్ల మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక. మాచర్ల మున్సిపాలిటీలో 31 మంది కౌన్సిలర్లు. టీడీపీకి 21 మంది మద్దతు.. వైస్‌ ఛైర్మన్‌గా మదార్‌ సాహెబ్‌ పోటీ.

నేడు ముంబైలో కోస్తా రాష్ట్రాల సదస్సు. కేంద్రమంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అధ్యక్షతన సదస్సు. రూ.225 కోట్లతో పలు ప్రాజెక్టుల ప్రారంభం. సదస్సులో పాల్గొననున్న ఏపీ, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల మత్స్యశాఖ మంత్రులు. పాల్గొననున్న పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌.

నేడు విట్స్‌కు సీఎం చంద్రబాబు. వర్సిటీ విద్యార్థులతో భేటకానున్న చంద్రబాబు.

తెలంగాణలో ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌. ఆదిలాబాద్‌, కొమురంభీమ్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్ష సూచన.

Exit mobile version