Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు. ఎడ్లబండ్లపై సభకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు. సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్‌, BRS నేతలు.

ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు. ముంబైతో తలపడనున్న లక్నో. ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్‌. ఢిల్లీ తో తలపడనున్న బెంగళూరు. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్‌.

నేడు బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణభవన్‌లో పార్టీ జెండా ఎగరవేయనున్న కేటీఆర్‌.అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్న కేటీఆర్‌. పార్టీ ఏర్పాటైన జలదృశ్యం దగ్గర కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళులర్పించనున్న కేటీఆర్‌.

విజయవాడ: నేడు సత్యకుమార్‌ పుస్తకావిష్కరణ. పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

కొనసాగుతున్న పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలు. వరుసగా మూడోరోజు వేర్వేరు సెక్టార్లలో కాల్పులు. నీలం వ్యాలీ, లీఫా వ్యాలీలో రాత్రంతా కాల్పులు. పాక్‌ సైన్యం కాల్పులను తిప్పికొట్టిన భారత సైన్యం.

భారత్‌లోని పాక్‌పౌరులకు నేటితో ముగియనున్న డెడ్‌లైన్‌. కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసుల తనిఖీలు. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయులు గుర్తింపు. దేశం విడిచివెళ్లాలని ఇప్పటికే ఆదేశించిన కేంద్రం.

నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో డీజీపీ సమావేశం. జమ్ముకశ్మీర్‌ పరిణామాలు, పాకిస్తానీయుల వీసాల రద్దు.. ప్రధాని పర్యటన అంశాలపై చర్చించనున్న సీఎం, డీజీపీ.

Exit mobile version