1. నేటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో మూడు రోజుల పాటు పర్యటన. ఉదయం చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ సెప్టెంబర్ 25న, చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న మృతి ఇరువురు కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో పాల్గొనున్న భువనేశ్వరి..
2. నేటి నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం. ఆన్‌లైన్ హాజరు నిబంధనలు పాటించాల్సిందేనని టీచర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.
3. నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ. అభ్యర్థుల రెండో జాబితాకు ఆమోదం తెలిపే అవకాశం.
4. నేడు ఢిల్లీకి బీజేపీ ముఖ్య నేతలు. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రేపు ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో కీలక సమావేశాలు. కీలక నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చే చాన్స్.
5. నేడు 47వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు.
6. ఏలూరు : నేడు పోలవరంలో పర్యటించనున్న మంత్రి అంబటి.. ప్రాజెక్ట్ పనులు పరిశీలించనున్న మంత్రి.
7. ఆర్ధిక శాఖ పై సమీక్ష చేయనున్న ముఖ్యమంత్రి జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.
8. నిర్మల్ : నేడు భైంసాలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు.
9. వరల్డ్‌కప్ : నేడు ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్. ఢిల్లీలో మధ్యా్హ్నం 2 గంటలకు మ్యాచ్.
