Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి 10 గంటలకు సేవ పక్షంలో భాగంగా అమీర్ పేట్ లోని MCH గురుగోవింద్ స్టేడియంలో లో జరిగే బ్లాడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమం లో పాల్గొంటారు. 10:45 గంటలకు
బజార్ ఘట్, నాంపల్లి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబులెన్సు ను డొనేట్ చేయనున్నారు.

2. మైనంపల్లి ఇంటికి ఈ రోజు ఉదయం 8.00 అల్పాహారంకి తెలంగాణ కాంగ్రెస్ చీప్ మాణిక్య రావ్ ఠాక్రె, భట్టి,ఉత్తమ్ కుమార్ తదితరులు‌‌ వస్తున్నట్లు సమాచారం…

3. ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..

4. విశాఖ : నేడు కేంద్ర మత్స్య శాఖ మంత్రి విజయ రూపాల పర్యటన… ఫిష్ అక్వేరియం ప్రారంభం, మత్య్స కారుల సమస్యలు పై నేరుగా తెలుసుకోనున్న మంత్రి.

5. తూర్పుగోదావరి జిల్లా : నేటికి 16వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్. నేడు జైలూలో చంద్రబాబుతో ములాఖాత్ కానున్న కుటుంబ సభ్యులు. ఉదయం 8 గంటల తర్వాత ములాకాత్ కోసం ధరఖాస్తు చేసే అవకాశం. ములాఖాత్ కు వెళ్లనున్న చంద్రబాబు భార్య భువనేశ్వరీ, కోడలు నారా బ్రాహ్మణితోపాటు మరొకరు.

6. తిరుమల…శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఎనిమిదోవ రోజు. ఇవాళ ఉదయం 7 గంటలకు రథోత్సవం. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి. రేపటితో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.

7. విజయవాడ : నేడు బెజవాడ రానున్న తెలంగాణ గవర్నర్ తమిళ సై. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ దీనోపాద్యాయ పుస్తక ఆవిష్కరణ లో పాల్గొననున్న తమిళ సై. మధ్యాహ్నం 2.30కి వచ్చి రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్న తమిళ సై.

8. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ. ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూముల స్కాం కేసుల్లో నారాయణ పై కేసులు నమోదు చేసిన సీఐడీ.

9. అమరావతి : ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లపై నేడు విచారణ.

10. ఇవాళ ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్ లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం పై ప్రశ్నలు. చంద్రన్న బీమా పథకం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ లు, విద్యా దీవెన, వసతి దీవెన అంశాల పై ప్రశ్నలు.

Exit mobile version