1. నేడు ఏపీ కొత్త గవర్నర్‌గా నజీర్ బాధ్యతల స్వీకరణ. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్.
2. నేడు మంత్రి తలసాని అత్యవసర సమావేశం. వీధికుక్కలు, కోతుల సమస్యపై అధికారులతో సమీక్ష.
3. నేడు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ. మధ్యాహ్నం 2.45 గంటలకు టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ.
4. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు తుది గడువు. ఏపీ, తెలంగాణలోనూ నామినేషన్లకు చివరి తేది. ఏపీలో టీడీపీ మద్దతుతో రంగంలోకి దిగిన అభ్యర్థులు.
5. నేడు హైదరాబాద్‌కు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్. తెలంగాణలో బీజేపీ పటిష్టతపై నేతలతో సమీక్ష.
6. నేడు లిక్కర్ స్కాంపై కోర్టులో విచారణ. ఈడీ చార్జిషీట్‌పై విచారించనున్న రౌస్ అవెన్యూకోర్టు.
7. నేడు హైకోర్టులో కుక్కల దాడిలో బాలుడు మృతిపై విచారణ. సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు. 4 రోజుల
క్రితం కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు.
8. AIADMK విభేదాల కేసులపై నేడు సుప్రీంలో తీర్పు. OPS, EPS మధ్య విభేదాల పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువరించనున్న సుప్రీకోర్టు.
9. అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ వాయిదా. నేటి జాబితాలో కనిపించని అమరావతి కేసు. అమరావతిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టును కోరిన ప్రభుత్వం. బుధ, గురువారాల్లో విచారణ చేపట్టరాదని జస్టిస్ డీవై చంద్రచూడ్ సర్కులర్ జారీ. తాజా సర్క్యులర్‌తో నేడు జరగాల్సిన విచారణ వాయిదా. తదుపరి విచారణపై ఇంకా రాని స్పష్టత.
10. నేడు మహిళల టీ20 వరల్డ్‌కప్ తొలి సెమీఫైనల్. ఆసీస్‌తో తలపడనున్న భారత మహిళల జట్టు. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
