Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు. నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్‌ కార్డులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక. లబ్దిదారుల జాబితా గ్రామ సభల్లో ప్రకటన. అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 24 వరకు జరగనున్న గ్రామ సభలు.

దావోస్‌లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటన. సీఐఐ సెషన్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ అంశంపై చర్చలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. పలు సంస్థల సీఈవోలు, చైర్మన్లతో సమావేశం. యూఏసీ ఎకనమీ మంత్రి బిన్‌తో భేటీకానున్న సీఎం.

రెండో రోజు దావోస్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన. పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న రేవంత్‌ రెడ్డి టూర్‌. పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్న రేవంత్‌ రెడ్డి.

నేడు ఏలూరు జిల్లాలో మంత్రి ప్రార్థసారథి పర్యటన. పోణంగి, కొమడవోలు, చొదిమెళ్లలో ఎన్టీఆర్‌ గృహ లేఅవుట్లను సందర్శించనున్న పార్థసారథి.

నేడు కర్నూలులో డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటన. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య ఎస్సీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో సమావేశంకానున్న డీజీపీ.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,930 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,870 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.93,200 లుగా ఉంది.

నేడు ప్రకాశంలో జిల్లాలో పెన్షన్లపై ప్రత్యేక బృందాలు విచారణ. మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో విచారణ.

తిరుమల: నేడు ఆన్‌లైన్లో ఏప్రిల్‌ నెల దర్శన టికెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహోత్సవ టికెట్లు విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.

నేడు నల్గొండలో కేటీఆర్‌ రైతు మహాధర్నా వాయిదా. ఇవాళ్టి కేటీఆర్‌ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు. హైకోర్టులో లంచ్‌మోహన్‌ పిటిషన్‌ వేసిన బీఆర్‌ఎస్‌. కోర్టు తీర్పు వచ్చే వరకు కేటీఆర్‌ రైతు మహాధర్నను వాయిదా వేసిన బీఆర్‌ఎస్‌. హైకోర్టు తీర్పు తర్వాత తేదీని ప్రకటించే అవకాశం.

Exit mobile version