Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేడు భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్ట్‌. ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనున్న భారత్‌. లీడ్స్‌ వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్‌.

విశాఖ: నేడు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్రమోడీ. సాయంత్రం 6.45 నిముషాలకు ఐఎన్ఎస్ డేగా వైమానిక స్థావరానికి చేరుకోనున్న ప్రధాని. స్వాగతం పలుకనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు. పెహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్ర మౌళి భార్యకు ప్రధానిని కలిసే అవకాశం.. స్వాగత కార్యక్రమాల తర్వాత తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రానికి చేరుకోనున్న ప్రధాని.. రేపు ఉదయం ఆర్కే బీచ్ వేదికగా యోగాంధ్రకు ముఖ్య అతిథిగా మోడీ.

శ్రీ సత్యసాయి : ఛలో పేరూరు, పాపిరెడ్డి పల్లి హెలిప్యాడ్ ఘటనలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కి నోటీసులు జారీ చేసిన పోలీసులు. ఈనెల 20న హాజరుకావాలని నోటీసులు పేర్కొన్న పోలీసులు. ఇవాళ విచారణకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాజరుపై నెలకొన్న సందిగ్ధత.

నేడు ఎన్ కౌంటర్ కు నిరసనగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో, బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు. బంద్ కారణంగా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహంన్స్ బలగాలు మోహరింపు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇవాళ కీలక పరిణామం. ప్రభాకర్‌ రావుపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్న సిట్‌. ప్రభాకర్‌రావుకు వెసులుబాటు రద్దు చేయమని కోరే అవకాశం. కస్టోడియల్‌ ఎంక్వయిరీ అనుమతించాలని కోరే అవకాశం.

విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స. వాంతులు, విరోచనాలతో పాటు బీపీ లో హెచ్చుతగ్గులు రావటంతో వంశీకి నిన్న ఆసుపత్రికి తరలింపు. ఇవాళ కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్న వంశీ.

విజయవాడ : లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు మీద నేడు ఏసీబీ కోర్టు విచారణ. కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లు మీద నేడు విచారణ.

కడప : నేడు జరగనున్న కడప మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి భారీ బందోబస్తు. ఇద్దరు డి.ఎస్పీ లు, 12 మంది సి.ఐలు, 20 మంది ఎస్.ఐ లు, 53 మంది ఏ.ఎస్.ఐ లు,110 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 4 స్పెషల్ పార్టీ పోలీసులు తో బందోబస్తు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరా, ‘నేత్రా’, ‘వజ్ర’ వాహనం ద్వారా నిఘా. ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కడప డి.ఎస్.పి హెచ్చరిక..

రాజన్న సిరిసిల్ల జిల్లా: రేవతి నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకములు నిర్వహించిన అర్చకులు. సాయంత్రం సదస్యం.

ఖమ్మం : నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన… పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు.

Exit mobile version