Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల. ఆగస్ట్‌ నెల ఆన్‌లైన్‌ ఆర్జిత, ఇతర టికెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌. మే 21న ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం. 22న ఉదయం 10 గంటలకు మరిన్ని టికెట్లు విడుదల. 22న మధ్యాహ్నం 3గంటలకు వర్చువల్‌ సేవలు విడుదల. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల.

ఏపీ: నేడు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు. కొత్త విధ్యావిధానంపై సంఘాల అభ్యంతరాలు. ఆందోళన వైపు వెళ్లకుండా ఆపే ప్రయత్నంలో ప్రభుత్వం.

వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ. బెయిల్‌ పిటిషన్‌పై విచారించనున్న నూజివీడు కోర్టు. నకిలీ పట్టాలు సృష్టించారన్న కేసులో విచారణ.

కడపలో టీడీపీ మహానాడుకు ముస్తాబు. నేటి నుంచి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం. ఈనెల 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు.

అమరావతి: స్థానిక సంస్థల్లో 28 ఖాళీలకు నేడు ఉప ఎన్నికలు. రాజీనామాలు, సభ్యుల మృతి చెందిన కారణంగా స్థానిక సంస్థల్లో ఖాళీలు.

నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన. హైదరాబాద్‌, మంచిర్యాల, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు వర్ష సూచన. ఈదురుగాలులతో వడగళల్ వర్షం కురిసే అవకాశం.

నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ అథారిటీ సమావేశం. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధానికి సంబంధించి కీలక నిర్ణయాలు. అథారిటీలో చర్చించిన తర్వాత కేబినెట్‌లో చర్చ.

తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95,120 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,190 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,07,900లుగా ఉంది.

నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన. రూ.12,600 కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాస పథకం. లబ్ధిదారులకు సోలార్‌ పంప్‌సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్‌.

సత్యసాయి: కదిరి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికకు రంగం సిద్ధం. టీడీపీ ఛైర్మన్‌, వైఎస్‌ ఛైర్మన్‌ పదవులు దక్కించుకునే అవకాశం. 25 మంది సభ్యులను కలిగి ఉన్న టీడీపీ. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు.

ఐపీఎల్‌: నేడు లక్నో vs హైదరాబాద్‌. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌.

విశాఖ: నేడు డిప్యూటీ మేయర్‌ ఎన్నిక. అభ్యర్థి ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ. డిప్యూటీ మేయర్‌ పదవి కోసం టీడీపీలో ముగ్గురు పోటీ. డిప్యూటీ మేయర్‌ పదవి ఇవ్వాలంటూ జనసేన పట్టు.

Exit mobile version