NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం. నేడు ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,850 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,450 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,01,000 లుగా ఉంది.

నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.

నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నిక. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం.

నేడు హైదరాబాద్‌ ఎల్బీ్స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు. వేడుకలకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 12 గంటలకు ముంబై నుంచి హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం. మధ్యాహ్నం 3 గంటలకు SCERT కార్యాలయ ప్రాంగణంలో చిన్నారుల మాక్‌ అసెంబ్లీలో పాల్గొననున్న రేవంత్‌. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవం.

నేడు సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్‌కు కేంద్రమంత్రి సుకాంత మజుందార్‌. ఎంపీ రఘునందన్‌తో కలిసి హాస్టల్‌ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి.

నేడు సిద్దిపేటకు క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌. కొండపాకలోని ఓ ఆసుపత్రిలో కార్డియక్‌ వార్డును ప్రారంభించనున్న గవాస్కర్‌.

నేడు సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన. జోనల్‌ స్థాయి క్రీడాపోటీలను ప్రారంభించనున్న మంత్రి దామోదర.

హన్మకొండ : 57వ జాతీయ గ్రం థాలయ వారోత్సవాలను నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు, హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి తెలిపారు.. మొదటి రోజు (గురువారం) ఉదయం 10 గంటలకు హన్మకొండ లోని జిల్లా గ్రంథాలయంలో వేడుకలు ప్రారంభమై,20 వ తారీకు వరకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.