NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే.?

Whats Today

Whats Today

కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం. మరో నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు. అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

అనంతపురం : తాడిపత్రి మండలం మండలం ఊరిచింతల, తలారి చెరువు గ్రామాలలో మొహరం సందర్బంగా మౌలాలి, బాదుల్లస్వామి వారి నేడు చిన్నసరిగెత్తు.

విజయనగరం : నేడు తోటపాలెం గాయత్రి స్కూల్ ఆవరణలో 17వ జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు.. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు టైక్వాండో పోటీలను ప్రారంభించనున్నారు.. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదగా విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు.

తూర్పుగోదావరి జిల్లా : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నంద్యాలలో మీటింగ్ లో పాల్గొంటారు.

ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో ఉంటారు.. అనంతరం అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమానికి హాజరవుతారు.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేట లో ఉంటారు..

ప్రకాశం : నేడు దర్శి వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలతో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమావేశం..

విజయవాడ : సీపీఎం ఆధ్వర్యంలో పోలవరంపై సెమినార్. రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రం పరిశీలన అంశంపై సెమినార్. సెమినార్ లో పాల్గొననున్న పోలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు.

ఏలూరు : పట్టిసీమ ఎత్తి పోతల 20 నుంచి పోలవరం కుడి కాలువలోకి కొనసాగుతున్న 7,080 క్యూసెక్కుల నీటి ప్రవాహం.. ఇప్పటి వరకు పట్టి సీమ నుంచి 4.62 టీఎంసీల నీరు విడుదల..

నేడు హైదరాబాద్‌లో గౌడ సోదరుల కోసం ‘కాటమయ్య రక్ష’ కిట్లు. అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలం లష్కర్‌‌గూడ గ్రామంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభం. గౌడన్నలతో సమావేశం తర్వాత వారితో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం. తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ.

రంగారెడ్డి జిల్లాకు వర్షసూచన. చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో వాన. సిటీలో పలు చోట్ల వర్షం.

నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,760లుగా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,610 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.95,400 లుగా ఉంది.