NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు సజ్జల, ఆర్కే, దేవినేని అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ. టీడీపీ ఆఫీసుపై దాడికేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌. ఇప్పటికే దాఖలైన అన్న పిటిషన్లు కలిపి నేడు విచారిస్తామన్న ఏపీ హైకోర్టు.

నేటి నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో పర్యాటకులకు అనుమతి. గత నెలలో ప్రమాదాలతో బీచ్‌లో పర్యాటకులకు అనుమతి నిరాకరించిన అధికారులు.

నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ బోనాల సందడి. నేడు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పణ. అంబేద్కర్‌ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు. సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగింపు.

నేడు ఆస్ట్రియాలో ప్రధాని మోడీ పర్యటన. 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటిస్తున్న తొలి భారతీయ ప్రధాని.

నేడు తెలంగాణకు కురియన్‌ కమిటీ.

అనకాపల్లిలోని నక్కలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వికటించిన ఇంజక్షన్. ఇంజక్షన్‌ తీసుకున్న కాసేపటికే 22 మంది రోగులకు అస్వస్థత. రియాక్షన్‌కు కారణమైన ఇంజక్షన్లను సీజ్‌ చేయాలని ఆదేశం. నేడు విచారణ కోసం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ఉన్నతాధికారులు.

నేడు 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. బెంగాల్‌-4, హిమాచ్‌-3, ఉత్తరాఖండ్‌-2 స్థానాలు, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌లో ఒక్కొక్క స్థానానికి ఉప ఎన్నిక. ఈ నెల 31న ఓట్ల లెక్కింపు.

నేడు భారత్‌-జింబాబ్వే మధ్య మూడో టీ20. సాయంత్రం 4.30 గంటలకు హరారే వేదికగా మ్యాచ్‌.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,200 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,000 లుగా ఉంది.

నేడు కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల. ఉదయం 9.30 గంటకు ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర నీటి విడుదల.

తెలంగాణకు భారీ వర్షసూచన. నేడు 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు.

నేడు సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష. జాతీయ రహదారుల అంశంపై NHAI అధికారులతో భేటీ. హాజరుకానున్న కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు.

నేడు తెలంగాణలో బీజేపీ సత్యాగ్రహ దీక్షలు. కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్‌. కలెక్టరేట్ల ముందు దీక్షచేయాలని బీజేపీ నేతల నిర్ణయం.

నేడు విశాఖకు కేంద్రమంత్రి హెచ్‌డీ కుమరస్వామి. రేపు స్టీల్‌ప్లాంట్‌ను సదర్శించనున్న కుమారస్వామి.