NTV Telugu Site icon

Whats Today : ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ వీడియో కాన్ఫరెన్స్. రైతు భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ. ఈనెల 17న సింగపూర్‌ వెళ్లనున్న సీఎం రేవంత్‌.

సికింద్రాబాద్‌ – విశాఖ వందేభారత్‌ను ఆప్‌గ్రేడ్‌ చేసిన రైల్వే శాఖ. ఇవాళ్లి నుంచి అందుబాటులో 4 అదనపు కోచ్‌లు. 20 కోచ్‌లతో రెగ్యులర్‌ ట్రైన్‌గా వందేభారత్‌ రాకపోకలు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన రద్దీ. గోవింద నామస్మరణతో మారుమోగుతున్న తిరుమల కొండ. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి.

భద్రాద్రి రామాలయంలో ముక్కోటి ఉత్సవాలు. ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. సీతారామ చంద్రస్వామి ఉత్తర ద్వార దర్శనం.

యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం. లక్ష్మినరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం.

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత. తెలంగాణపై చలి పంజా. ఆదిలాబాద్‌, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌. ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత. పటాన్‌చెరులో 9.6, రామగుండంలో 10.6 డిగ్రీలు, మెదక్‌లో 11.3, వరంగల్‌లో 11.5 డిగ్రీలు.

అల్లూరి ఏజెన్సీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు. జి.మాడుగుల 6, పాడేరు 10, మినుములూరు, అరకులో 8 డిగ్రీలు. ఏజెన్సీలో పలు చోట్ల సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు.

నేడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ. తిరుపతిలో నమోదైన కేసులో ఏపీ హైకోర్టులో చెవిరెడ్డి ముందస్తు బెయిల్‌.

కాకినాడ: నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన. మినీ గోకులాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్‌. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్‌.

తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.79,210 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,610 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900లుగా ఉంది.

Show comments