Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. ఖమ్మంలో నేడు బండి సంజయ్‌ పర్యటన. ఈ నెల 15న అమిత్‌ షా టూర్‌. బహిరంగ సభ, జన సమీకరణపై బండి సంజయ్‌ చర్చ.

2. నేటి నుంచి చేపప్రసాదం పంపిణీ. హైదరాబాద్‌ నాంపల్లి గ్రౌండ్స్‌లో పంపిణీకి ఏర్పాట్లు. చేప ప్రసాదం కోసం రాత్రి నుంచి క్యూ కట్టిన జనం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత చేపప్రసాదం పంపిణీ. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ.

3. నేడు సాయంత్రం తిరుపతికి రానున్న జేపీ నడ్డా. రేపు శ్రీకాళహస్తిలో నడ్డా బహిరంగ సభ. మోడీ తొమిదేళ్ల పాలనపై వివరించనున్న నడ్డా.

4. వరుస పర్యటనలతో కేసీఆర్‌ బిజీ బిజీ. నేడు మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం.

5. ఖమ్మం జిల్లాలో మరోసారి పొలిటికల్‌ హీట్. నేడు కీలక నేతలతో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమావేశం. తన అనుచరులకు నిర్ణయం వెల్లడించనున్న పొంగులేటి.

6. భాస్కర్‌రెడ్డి బెయిల్‌పై నేడు సీబీఐ కోర్టు తీర్పు. వివేవా హత్య కేసులో ఏ-7గా ఉన్న భాస్కర్‌రెడ్డి. సునీత ఇంప్లీడ్‌ పిటిషన్‌కు సీబీఐ కోర్టు అనుమతి.

7. నేడు సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన. దశాబ్ది ఉత్సవాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్‌రావు.

8. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,220 లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77,700 లుగా ఉంది.

Exit mobile version