Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు. ప్రధాని మోడీతో భేటీకానున్న ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌. యుద్ధ పరిస్థితులపై చర్చించనున్న అజిత్‌ దోవల్‌.

నేడు CDS త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ భేటీ. పాక్‌ దాడులు, భారత ప్రతిచర్యలపై మీడియా సమావేశాలు నిర్వహించనున్న రక్షణ, విదేశాంగ శాఖ.

రాత్రి జమ్మూపై పాక్‌ డ్రోన్‌ దాడి. రంగంలోకి దిగిన జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా. పరిస్థితిని సమీక్షించేందుకు జమ్ము వెళ్తున్న సీఎం.

పంజాబ్‌లో కొనసాగుతున్న పాక్‌ కాల్పులు. పాక్‌ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం. అమృత్‌సర్‌లో మళ్లీ మోగిన ఎయిర్‌ రైడ్‌ సైరన్‌.

ఖమ్మం :నేడు సీతారామ ప్రాజెక్ట్ కాలువలను పరిశీలించి రివ్యూ చేయనున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

గుంటూరు: నేడు గుంటూరు సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు రానున్న సజ్జల‌ రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్. టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు రావాలన్న సీఐడీ.

ఖమ్మం: నేడు జిల్లాలో కేటీఆర్ పర్యటన తల్లాడ మండలం మిట్టపల్లి లో బహిరంగ సభ లో పాల్గొనున్న కేటీఆర్

దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద భారీ భద్రత. భారత్‌-పాక్‌ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.

Exit mobile version