Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు ఉదయం 11 గంటలకు సీసీఎస్ అత్యవసర సమావేశం.. సీసీఎస్ భేటీ తర్వాత కేంద్ర కేబినెట్ భేటీ..

నేడు ఉదయం 10 గంటలకు ఇండియన్ ఆర్మీ అధికారుల మీడియా సమావేశం.. ఆపరేషన్ సింధూర్ పై వివరాలు వెల్లడించనున్న ఆర్మీ ఉన్నతాధికారులు..

ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పర్యటన.

భద్రాద్రి జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.

విశాఖ : నేడు విశాఖలో పౌరుల సన్నద్ధతపై మాక్ డ్రిల్. అప్రమత్తమైన యంత్రాంగం… అత్యవసర పరిస్థితులపై సివిలియన్స్ కు అవగాహన… తెలుగు రాష్ట్రాల్లో కేటగిరి-2 లో ఉన్న విశాఖ… విశాఖలో సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో రెండు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.. వన్ టౌన్ ఏరియాలోని కొత్త జాలరి పేట, సీతమ్మ దారిలోని ఆక్సిజన్ టవర్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు..

నేడు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు.

ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించడానికి నియమించిన అధికారుల కమిటీ బుధవారం సాయంత్రం తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలతో సమావేశం.

నేడు హైదరాబాద్‌లో పౌరుల సన్నద్ధతపై మాక్ డ్రిల్. అప్రమత్తమైన యంత్రాంగం… అత్యవసర పరిస్థితులపై సివిలియన్స్ కు అవగాహన… తెలుగు రాష్ట్రాల్లో కేటగిరి-2 లో ఉన్న హైదరాబాద్‌…

Exit mobile version