NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై సమస్త అధికార యంత్రాంగానికి సీఎం దిశా నిర్ధేశం చేయనున్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పవన్ భేటీ కానున్నారు.

నేటి నుంచి నాలుగు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది. కొత్తగా నిర్మించనున్న డయాఫ్రమ్ వాల్, ఇసిఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలపై ప్రాజెక్టు అధికారులతో కలిసి ఈ బృందం చర్చించనుంది. ముందుగా విదేశీ నిపుణులు, ఇంజినీర్లు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. గతంలో వారు సూచించిన మేరకు చేసిన పరీక్షల్లో ఎలాంటి ఫలితాలొచ్చాయి, కాఫర్‌డ్యాంల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలేంటి తదితర అంశాలపై చర్చిస్తారు.

ఈరోజు నుంచి తెలంగాణలో కులగణన. ఈ నెల 8వరకు ఇంటి సర్వే.. 9 నుంచి నుంచి కుటుంబ వివరాలు నమోదు. కులగణన పూర్తి చేసేందుకు 30 రోజుల గడువు. 80 వేల మంది ఎన్యూమరేటర్ల నియామకం. మండలాలవారీగా కంప్యూటరీకరణ చేయనున్న అధికారులు.

భారీ లాభాల్లో అమెరికా స్టాక్‌మార్కెట్లు. లాభాల్లో డోజోన్స్‌, నాస్‌డాక్‌ సూచీలు. ట్రంప్‌కు చెందిన కంపెనీలో తీవ్ర ఒడిదుడుకులు. ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లిన ట్రంప్‌ షేర్లు. రెండుసార్లు నిలిచిపోయిన ట్రేడింగ్‌.

అమెరికాలో కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌. పోలింగ్‌ ముగిసిన పలుచోట్ల కౌంటింగ్‌. హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. ట్రంప్‌ ఖాతాలో ఇండియానా, కెంటకీ, వెస్ట్‌ వర్జీనియా. వెర్మాంట్‌లో కమలాహారిస్‌ విజయం. 10 రాష్ట్రాల్లో ట్రంప్‌ విజయం. ఆరు రాష్ట్రాల్లో కమలాహారిస్‌ గెలుపు.

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,550. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,240లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 1,05,000లుగా ఉంది.

అమరావతి : నేడు నందిగం సురేష్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు. హత్య కేసులో బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టులో నందిగం సురేష్‌ పిటిషన్‌.

అమరావతి: నేడు అల్లుఅర్జున్‌ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు. ఎన్నికల ప్రచార కేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్‌ పిటిషన్‌. గతంలో విచారించి తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు.