NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేటి నుంచి జగన్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో వైసీపీ కార్యాలయం. ఇప్పటివరకు తాడేపల్లిలో నడిచిన వైసీపీ కేంద్ర కార్యాలయం. కొత్త ఆఫీస్‌ నుంచే నేటి నుంచి వైసీపీ కార్యకలాపాలు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో నేడు సెమీఫైనల్‌ ఆడనున్న భారత హాకీ జట్టు. ఈ రోజు రాత్రి 10.30 గంటలకు హాకీ సెమీ ఫైనల్‌. జర్మనీతో తలపడనున్న భారత హాకీ జట్టు.

తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,570 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.91,100 లుగా ఉంది.

నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీ.

విశాఖలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరణ. 16న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం.

నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన. ఆందోల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొననున్న దామోదర రాజనర్సింహ.

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద. 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. 4 గేట్లు 5 ఫీట్లు, 16 గేట్లను 10 ఫీట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల. నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో 3,00,530 క్యూసెక్కులు. క్రస్ట్‌ గేట్ల ద్వారా ఔట్‌ ఫ్లో 2,54,460 క్యూసెక్కులు.

ఢిల్లీలో కేటీఆర్‌, హరీష్‌ రావు. నేడు తిహార్‌ జైలులో కవితతో ములాఖత్‌.

పారిస్‌ ఒలింపిక్స్‌లో నేడు మధ్యాహ్నం 3.20 గంటలకు పురుషుల జావెలిన్‌ త్రో క్వాలివికేషన్‌. జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్‌ బరిలో నీరజ్‌ చోప్రా.

నేడు విజయవాడకు మాజీ సీఎం జగన్‌. జగ్గయ్యపేటలో దాడికి గురైన కార్యకర్తకు పరామర్శ.

Show comments