NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు కీలక కేసుల్లో తీర్పులు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు.

శాంతిస్తున్న కృష్ణమ్మ. క్రమంగా తగ్గుతున్న కృష్ణా నది వరద ఉదృతి. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి చేరకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తగ్గుతున్న నీటి మట్టం. నిన్న రాత్రి 9 గంటలకు 11.13 లక్షల వరద ప్రవాహం. ఇవాళ ఉదయం 5 గంటల నాటికి 9.79 లక్షల క్యూసెక్కుల కు చేరి తగ్గిన వరద ప్రవాహం. మధ్యాహ్నం సమయానికి బ్యారేజ్ దగ్గర మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్న అధికారులు.

నేటితో శ్రీశైలం మహాక్షేత్రంలో ముగియనున్న శ్రావణ మసోత్సవాలు. శ్రావణ మాసం మొదటి రోజు ప్రారంభించిన శివ సప్తాహ భజనలు రేపటితో ముగింపు. శ్రావణమాసం ముగుస్తుండటంతో శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి పెరగనున్న భక్తుల రద్దీ.

నేడు ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా లో నేడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న మంత్రి శ్రీధర్‌ బాబు.

మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ మాత. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ ఉగ్రరూపం దాల్చిన మంజీరా నది. అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతున్న మంజీరా. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్న అమ్మవారు.

నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో 20 రైళ్లు రద్దు. వర్షాలతో ఇప్పటివరకు 544 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. నేడు మరో 20 రైళ్లు దారి మళ్లింపు, ఇప్పటివరకు 187 రైళ్లు దారి మళ్లింపు. తాత్కాలికంగా 3 రోజుల్లో 20కి పైగా రైళ్లు రద్దు.

మహబూబాబాద్‌ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు. భారీ వర్షాలతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటన.

నేడు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ వ్యూ. విజయవాడ కలెక్టరేట్‌లోనే రాత్రి సీఎం చంద్రబాబు బస.

ఇంకా వరద ముంపులోనే ఖమ్మంలోని పలు కాలనీలు. ఖమ్మంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. తెలంగాణలో వరదకు ఇప్పటివరకు 16 మంది మృతి.

విశాఖ: బలహీనపడిన వాయుగుండం. అల్పపీడనంగా మారి వాయుగుండం. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం. కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.

తెలంగాణలో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ ఆదేశం. రానున్న మూడు గంటల్లో పలుచోట్ల మోస్తరు వానలు. హైదరాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, భువనగిరి జిల్లాలకు వర్షసూచన.

Show comments