NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి కోమటిరెడ్డి.

నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యట. ఐకానిక్‌ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనున్న ఐఐటీ ఇంజనీర్లు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత.

నేడు రాజమండ్రిలో ఎంపీ పురందేశ్వరి పర్యటన. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న పురందేశ్వరి. మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే విస్తరణపై అధికారులతో సమీక్ష. తర్వాత ఢిల్లీకి వెళ్లనున్న పురందేశ్వరి.

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,700 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,810 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.90,900 లుగా ఉంది.

నేడు ఉదయం 11 గంటలకు అమరావతిలోని పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు. సందర్శకుల సౌకర్యార్ధం షెడ్యూల్‌ మార్చుకున్న చంద్రబాబు. ప్రతి శనివారం మధ్యాహ్నం తర్వాత పార్టీ ఆఫీస్‌కు వస్తున్న చంద్రబాబు. ఇకపై ప్రతి శనివారం ఉదయం పార్టీ ఆఫీస్‌లో అందుబాటులో చంద్రబాబు.

నేడు మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఆప్కాబ్‌ సమావేశం. హాజరుకానున్న వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, మత్స్యశాఖ అధికారులు. రైతులకు రుణాలు అందజేత అంశంపై సమీక్ష.

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన. మధిరలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న భట్టి.

తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన. జనగాం, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.

నేడు ఢిల్లీలో అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు. సదస్సులో పాల్గొననున్న 75 దేశాల ప్రతినిధులు. సుస్థిర వ్యవసాయం- ఆహార వ్యవస్థల అంశాలపై చర్చ.

ఒలింపిక్స్‌లో మరో పతకానికి చేరువలో మనుభాకర్. 25మీటర్ల పిస్టల్ విభాగంలో ఫైనల్‌కి చేరిన మను. ఇప్పటికే రెండు కాంస్యాలు సాధించిన మనుభాకర్‌. మధ్యాహ్నం ఒంటిగంటకు 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్‌.