NTV Telugu Site icon

Amritpal Singh: 80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?.. కోర్టు ఆగ్రహం

Khalistani Leader

Khalistani Leader

Amritpal Singh: ఖలిస్తానీ-పాకిస్తాన్‌ ఏజెంట్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ వ్యవహరంలో పంజాబ్‌-హర్యానాల ఉన్నత న్యాయస్థానం పంజాబ్‌ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌పాల్‌ను అరెస్ట్‌ చేయడంలో విఫలం కావడంపై మండిపడిన న్యాయస్థానం.. ఆపరేషన్‌ తాలుకా నివేదికను సమర్పించాలని పంజాబ్‌ పోలీస్‌ శాఖను ఆదేశించింది. ‘‘మీ వద్ద 80 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారు? అమృత్‌పాల్‌ సింగ్‌ ఎలా తప్పించుకున్నాడు?’’ అంటూ పంజాబ్‌- హరియాణా హైకోర్టు మంగళవారం పంజాబ్‌) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరారీలో ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా నిఘా వర్గాల ఫెయిల్యూర్‌ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తరుణంలో అతన్ని అరెస్ట్‌ చేసేందుకు శనివారం నుంచి భారీ ఎత్తున్న చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. ఇప్పటిదాకా 120 మంది అమృత్‌పాల్‌ అనుచరుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

అంతకు ముందు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఈ పరిణామాలపై స్పందించారు. పంజాబ్‌ కోరుకునేది శాంతి, అభివృద్ధి మాత్రమే. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఊపేక్షించబోమన్నారు. కఠినంగా అణచివేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిసామరస్యాలకు విఘాతం కలిగించేందుకు యత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భగవంత్ మాన్‌ పేర్కొన్నారు. అమృత్‌పాల్‌ ఆచూకీ కోసం పోలీసులు చేపడుతోన్న ఆపరేషన్‌పై పంజాబ్‌ ముఖ్యమంత్రి తొలిసారిగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిసామరస్యాలతోపాటు దేశ పురోగతే తన ప్రాధాన్యాలని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులను వదిలిపెట్టబోమన్నారు. ‘

Read Also: Ffreedom App: ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోర్సులు.. ఇప్పుడు సరసమైన ధరలకే..

ఖలీస్తానీ-పాకిస్తాన్‌ ఏజెంట్‌గా అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌ సర్కారు ఇదివరకే ప్రకటించింది. ‘వారిస్‌​ పంజాబ్‌ దే’ సిక్కు గ్రూప్‌ చీఫ్‌గా.. అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి దానిని స్థాపించింది సందీప్‌ సింగ్‌ అలియాస్‌ దీప్‌ సింగ్‌ అనే పంజాబీ నటుడు కమ్‌ ఉద్యమకారుడు. పంజాబీల హక్కుల సాధన-పరిరక్షణ విషయంలో కేంద్రంతో కొట్లాడేందుకు ఈ గ్రూప్‌ను స్థాపించాడు. సందీప్‌ నుంచి వారసత్వంగా విభాగపు బాధ్యతలను అమృత్‌పాల్‌ సింగ్ తీసుకున్నాడు. అయితే హక్కుల గ్రూప్‌ను కాస్త ఉగ్రవాదంపై మళ్లించినట్లు అమృత్‌పాల్‌ సింగ్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. ఉదమ్యం ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు నిఘా వర్గాలు కాస్త ఆలస్యంగా గుర్తించాయి. కిందటి నెలలో తన అనుచరులను ఉసిగొల్పి ఓ పోలీస్‌ స్టేషన్‌పై మారణాయుధాలతో దాడికి దిగి తన ప్రధాన అనుచరుడిని విడిపించుకున్నాడు. ఈ దాడిలో ఆరుగురు పోలీస్‌ సిబ్బంది గాయపడ్డారు.