* నేడు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్.. ఎల్బీ స్టేడియంలో ఉదయం 10 గంటలకు మ్యాచ్.. ఇప్పటికే టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా.. తన కెరీర్‌లో చివరి మ్యాచ్ హైదరాబాద్‌లో ఆడాలని సానియా నిర్ణయం
* నేడు పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సభ.. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి వరుస సభలు
* నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన.. ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమార్తె వివాహానికి హాజరుకానున్న సీఎం
* ఏలూరు జిల్లా: నేడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి అంబటి రాంబాబు.. అనంతరం మీడియా సమావేశం
* కాకినాడ: నేడు ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జి వరుపుల రాజా అంత్యక్రియలు.. ప్రత్తిపాడులోనే అంత్యక్రియలు
* నేడు కర్నూలుకు రానున్న నవ దంపతులు మంచు మనోజ్, భూమా మౌనిక.. ఎస్వీ సుబ్బారెడ్డి ఆశీస్సులు తీసుకొని ఆళ్లగడ్డలో దివంగత భూమా నాగిరెడ్డి, శోభ ఘాట్‌లో నివాళులు అర్పించనున్న మనోజ్, మౌనిక
* కర్నూలు: నేటి నుంచి కోడుమూరు మండలంలోని శ్రీ గోరంట్ల లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలు.. నేడు పుణ్యాహవాచనము, అంకురార్పణము, రక్షాబంధనము
* విశాఖ: నేడు నగరానికి రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మూడు రోజులు నగరంలోనే బస చేయనున్న వెంకయ్యనాయుడు
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* నేడు వేములవాడలో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. కళికోట ప్రాజెక్టును సందర్శించనున్న రేవంత్ రెడ్డి.. రాత్రి 7 గంటలకు వేములవాడలో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్