NTV Telugu Site icon

Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికలు.. రేస్‌ నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా..?

Babu

Babu

Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు అటువైపు దృష్టిసారించాయి.. ఇక, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని పోటీలో పెడుతుందనే ప్రచారం జరుగుతూ వచ్చింది.. అయితే, రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవాలన్నా.. ఇప్పుడున్న బలం కంటే అదనంగా 25 నుంచి 26 ఎమ్మెల్యేల అవసరం టీడీపీకి ఉంటుంది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలైనా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీదేవి, ఆనం రామనారయణరెడ్డిలపై వేటు పడకుంటే ఆ సంఖ్య కాస్త తగ్గుతుంది..

Read Also: Andhra Pradesh: సమ్మెకు సిద్ధమవుతోన్న ఉద్యోగులు..! నేడు మంత్రుల బృందం చర్చలు

ఇక, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం తర్వాత పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ మారిపోయాయి.. టీడీపీ సంఖ్యాబలాన్ని తగ్గించేందుకు వైసీపీ కసరత్తు చేస్తుంటే.. అయితే, తమకు వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ.. కానీ, ఇప్పుడు సైకిల్‌ పార్టీ నుంచి రాజ్యసభ ఎన్నికల హడావిడి అంతగా కనిపించడంలేదు.. పెద్దల సభకు పోటీపై టీడీపీ అధినేత ఏమైనా సైలెంట్‌ఆపరేషన్‌ చేస్తున్నారా? లేక పోటీ నుంచి తప్పుకుంటారా? అనే చర్చ తమ్ముళ్ల మధ్య జరుగుతుంది.

Read Also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

చంద్రబాబు సైలెంట్‌గా ఉండడంతో.. ఈ మౌనం దేనికి సంకేతం? రాజ్యసభ రేస్‌ నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా? లేక గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారా? అనే చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి హడావిడి లేకుండానే అభ్యర్థిని బరిలోకి దింపడం.. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం చకచకా జరిగిపోయాయి.. ఇప్పుడు కూడా అలాంటి సీక్రెట్‌ ఆపరేషన్‌ జరుగుతుందా? అనే చర్చ జరుగుతుంది. వైసీపీలో అసంతృప్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది.. దీంతో, వారితో టీడీపీ హైకమాండ్‌ టచ్‌లోకి వెళ్లిఉండవచ్చు అని.. లేదా? వైసీపీ అసంతృప్తులే టీడీపీతో టచ్‌లోకి వచ్చిఉంటారనే వాదన వినిపిస్తోంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలతోనే వ్యవహారం కాబట్టి సాఫీగా సాగిపోయింది.. కానీ, రాజ్యసభలో పరిస్థితి వేరు.. 25 నుంచి 26 మంది పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి అనేది టీడీపీ వర్గాల్లో సాగుతోన్న చర్చ.. ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ అంశంపై ఆసక్తి నెలకొంది.