Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898ఎడి’.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న”కల్కి” మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
హిందూ పురాణ కథల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్.. విష్ణుమూర్తి ‘కల్కి’ అవతారంలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఏకంగా 5 పార్ట్స్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం.మొదటి భాగం చివరిలో కమల్ హాసన్ పాత్ర ఎంట్రీ ఉండనున్నట్లు సమాచారం..కమల్ హాసన్ పాత్ర ఎంట్రీతో సినిమా కథ కీలక మలుపు తిరుగనున్నట్లు సమాచారం.మొదటి పార్ట్ లో కమల హాసన్ పాత్ర నిడివి కేవలం 20 నిముషాలు మాత్రమే వుంటుందట.సెకండ్ పార్ట్ లో మాత్రం కమల్ పాత్ర దాదాపు గంటకు పైగా ఉంటుందని సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.