ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు వీపరీతంగా నమోదవుతున్నాయి, సూర్యుడు వేడికి ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో జంకుతున్నారు. కాబట్టి ప్రజలు వీలైనంత ఎక్కువగా ఇంట్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుడదని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఎంత ఇంట్లో ఉందాం.. అనుకున్నప్పటికీ ఏదో ఒక పరిస్థితుల్లో ఎండలోకి రావాల్సిన సమయం వస్తుంది.
Read Also : MP R. Krishnaiah : అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు , స్కై ఓవర్లు మాత్రమే కాదు
అలా ఎండలో బయటకు వచ్చిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. అయితే వడదెబ్బ తగిలితే ఏం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం.. వడదెబ్బ లక్షణాలు.. సాధారణంగా చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో సరిగా తెలియకపోవచ్చు. ఏదో నీరసంగా ఉంది కొంచెం సేపు రెస్టో తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అదే పొరపాటు. వడదెబ్బ తగిలిని వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే వడదెబ్బ లక్షణాలు..
Read Also : MLA Jagga Reddy : ఇంచార్జీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
1.. వడదెబ్బ లక్షణాలు :
* వడదెబ్బ తగిలిన వ్యక్తికి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
* వాంతులు, నీరసం, శరీరం పొడిబారటం లాంటివి జరుగుతాయి.
* కండరాల్లో తిమ్మిరి, శరీరంలో వాపు.. అధికంగా చెమటలు పడతాయి.
2.. వడదెబ్బ తగిలితే చేయాల్సిన పనులు..
* వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడకు చేర్చాలి.
* శరీరానికి బాగా గాలి తగిలేలా చూడాలి.
* చల్లటి నీటిలో బట్టను ముంచి శరీరానికి బాగా అద్దాలి
* ఉప్పు కలిపిన నీటిని, మజ్జిక, గ్లూకోజ్ నీళ్లు తాగించాలి.
ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.. కాబట్టి మధ్యాహ్నం బయటకు వెళ్లకపోవడం చాలా వరకు ఉత్తమం అని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అధిక మొత్తంలో వాటర్ తాగడం మంచిది.