Gold Purity: భారతదేశంలో బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రధానంగా కొనుగోలుదారులు ఆందోళన చెందే విషయం ప్యూరిటీ. అయితే BIS హాల్‌మార్కింగ్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వినియోగదారులు మరింత నమ్మకంతో బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే BIS హాల్‌మార్క్ గోల్డ్, KDM గోల్డ్, 916 గోల్డ్ అనే పదాల అర్థాలు వాటి మధ్య తేడాలు, కొనుగోలు సమయంలో గమనించవలసిన ముఖ్య అంశాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
Saudi Arabia: 73 ఏళ్లుగా మద్యం అమ్మని ముస్లిం దేశం.. కానీ ఇప్పుడు !
హాల్‌మార్క్ గోల్డ్ అంటే ఏమిటి?
బంగారం ప్యూరిటీ, నాణ్యతను పరీక్షించి ధ్రువీకరించే ప్రక్రియను హాల్‌మార్కింగ్ అంటారు. బంగారం ఆభరణం లేదా నాణేంపై BIS హాల్‌మార్క్ కనిపిస్తే అది BIS నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అర్థం. ఉదాహరణకు 18K హాల్‌మార్క్ గోల్డ్ అంటే ఆ ఆభరణంలో 18/24 భాగాలు బంగారం, మిగతా భాగాలు మిశ్రమ లోహాలు ఉంటాయని అర్థం. BIS (Bureau of Indian Standards) భారతదేశంలో హాల్‌మార్కింగ్‌ను నియంత్రించే సంస్థ. ఇక హాల్‌మార్క్ ముద్రలో ఉండే నాలుగు ముఖ్య భాగాలు ప్రతి బంగారం కొనుగోలుదారునికి ఎంతో ప్రాధాన్యం కలిగిన అంశాలు.
ఇందులో మొదటిగా BIS హాల్‌మార్క్ చిహ్నం. ఇది ఆభరణం లేదా నాణెం శుద్ధతను అధికారికంగా ధృవీకరించినట్లని సూచిస్తుంది. రెండవది క్యారెట్ (Karat), ఫైనెస్ (Fineness) సంఖ్య. ఇందులో 22K–916 (91.6% శుద్ధ బంగారం), 18K–750 (75% శుద్ధ బంగారం), 14K–585 (58.5% శుద్ధ బంగారం) వంటి వివరాలు లేజర్ ద్వారా ముద్ర రూపంలో ఉంటాయి. మూడవది Assaying & Hallmarking సెంటర్ ముద్ర. ఇది ఆ ఆభరణాన్ని పరీక్షించిన గుర్తింపు పొందిన సెంటర్ వివరాన్ని సూచిస్తుంది. చివరిగా జ్యువెలర్ సంబంధించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. దీని ద్వారా ఆభరణాన్ని తయారు చేసిన జ్యువెలర్‌ను గుర్తించవచ్చు.
IND vs SA 2nd Test: ముగిసిన నాల్గవ రోజు ఆట.. టీమిండియా విజయానికి ఎన్ని పరుగులు అవసరమంటే..?
KDM గోల్డ్ విషయానికి వస్తే.. ఇది 92% శుద్ధ బంగారం, 8% ఇతర లోహాల మిశ్రమంతో తయారైన బంగారం. గతంలో ఇది బాగా ఉపయోగించబడింది. ప్యూరిటీకి ఇబ్బంది లేకపోయినా, ఆభరణాల తయారీలో పాల్గొనే కార్మికులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు కలిగించడం వల్ల BIS దీనిని నిషేధించింది. ప్రస్తుతం క్యాడ్మియం స్థానంలో జింక్ వంటి మెరుగైన సాల్డర్ లోహాలను ఉపయోగిస్తున్నారు. ఇక 916 గోల్డ్ అంటే 22 క్యారెట్ గోల్డ్‌కి సమానమైనది. ఇది 100 గ్రాముల మిశ్రమంలో 91.6 గ్రాములు శుద్ధ బంగారం ఉందని సూచిస్తుంది. అందుకే 22K గోల్డ్‌ను BIS 916, 23K గోల్డ్‌ను BIS 958 గా పిలుస్తారు. ఈ సంఖ్యలు హాల్‌మార్క్ ముద్రలో భాగంగా ఉండి కొనుగోలుదారులకు బంగారం శుద్ధతపై ఒక క్లారిటిని కలిగిస్తాయి.