Site icon NTV Telugu

Purandeshwari: ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ హర్షణీయం..

Purandeshwari

Purandeshwari

ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ హర్షణీయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి ఆస్తులు, అప్పులు పంపకాలకు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు నేరుగా భేటీ కావడం వలన అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. రాష్ట్ర విభజన ఆస్తులు, అప్పులు పంపకాలకు సంబంధించి కేంద్రం ఇంతకుముందే కమిటీ వేసిందని.. కమిటీలు చర్చించే కంటే ముఖ్యమంత్రులు భేటీ కావడం పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని పురందేశ్వరి తెలిపారు.

Read Also: Alcohol: ఆల్కహాల్‌తో ఎనర్జీ డ్రింక్‌తో కలిపి తాగితే అంతే సంగతి.. అధ్యయనంలో కీలక విషయాలు..

కాగా.. కాసేపట్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల అధికారులు పది అంశాల అజెండాను సిద్ధం చేశారు. సుదీర్ఘ కాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగనుంది. షెడ్యూల్ 9, 10 లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీ తరుఫున చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేశ్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు ఈ చర్చల్లో పాల్గొంటారు.

Read Also: Renukaswamy Murder Case: హత్యకు ముందు పీకల దాకా ఆహారం.. రేణుకా స్వామి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు

Exit mobile version