NTV Telugu Site icon

Harish Rao: వెంటనే త‌డిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి..

Harish Rao

Harish Rao

జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం యొక్క వివరాలను సేకరించారు. దీంతో పాటు జగిత్యాల జాయింట్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. వెంటనే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని కోరారు. లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింప చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

Read Also: Kishan Reddy: ముఖ్యమంత్రికి రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారింది..!

తెలంగాణ అసెంబ్లీలో రైతుల పక్షాన మేము కొట్లాడుతాం అని హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ బయట రైతులందరూ ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే 6 గారంటీలను అమలు చేస్తామన్నారు.. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు హామీలను తుంగలో తొక్కి రైతుల గుండెల మీద తన్నారు అంటూ హరీశ్ రావు మండిపడ్డారు. కాగా, అంతకుముందు కొండగట్టు అంజనేయ స్వామిని నేటి ఉదయం హరీశ్ రావు దర్శించుకున్నారు. తర్వాత ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఆలయ సిబ్బంది మర్యాదాలతో స్వాగతం పలికారు. వేదపండితులు వేద ఆశీర్వచనలు అందించి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన హరీశ్ రావును స్థానిక నేతలు సన్మానించారు.