ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ లో సమానంగా ఉన్న భారత్- వెస్టిండీస్.. చివరి వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికి సిరీస్ దక్కుతుంది. ఈ మ్యాచ్ లో మరోసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. వెస్టిండీస్‌తో వరుసగా 13వ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అదే వెస్టిండీస్ గెలిస్తే.. 2006 తర్వాత తొలిసారిగా సిరీస్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.
Rooftop Tomato Farming: ఇంటిపైనే టామోటాలను ఎలా పండించాలి?
ట్రినిడాడ్‌లోని టోరుబాలో జరుగుతున్న ఈ మ్యాచ్ జరుగుతుంది. గత మ్యాచ్ లాగే మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. మరోవైపు టీమిండియాలో రెండు మార్పులు చేశారు. ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడటం లేదు.
Mrunal Thakur: సెట్ లో మృణాల్ బర్త్ డే.. కేక్ కట్ చేయించిన విజయ్
IND vs WI: 3rd ODI XI
భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రీతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్
వెస్టిండీస్: షే హోప్ (c, wk), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ ఎతనాగే, షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, KC కార్తీ, యాన్నిక్ కారియా, అల్జారీ జోసెఫ్, జాడెన్ సీల్స్, గుడ్కేష్ మోతీ