IND vs WI 1st T20: టెస్ట్, వన్డే సిరీస్‌లలో వరుస ఓటమిల తర్వాత వెస్టిండీస్ జట్టు టీ20 సిరీస్‌లో భారత జట్టుపై ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున తిలక్ వర్మ , ముకేశ్ కుమార్‌లు అరంగేట్రం చేయనున్నారు.
Also Read: Andaman Nicobar Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం … రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదు
కనీసం టీ20 సిరీస్‌లోనైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలనే పట్టుదలతో విండీస్ బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లోనే విండీస్ జట్టును మట్టి కరిపించాలని హార్దిక్ పాండ్యా సేన భావిస్తోంది. ఇప్పటి వరకు టీమ్ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య 25 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత జట్టు 17 మ్యాచుల్లో గెలవగా.. 7 మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. వెస్టిండీస్ గడ్డపైనా టీమ్ఇండియాదే ఆధిక్యం. అక్కడ 4 మ్యాచుల్లో టీమిండియా విజయాన్ని అందుకోగా.. ప్రత్యర్థి జట్టు కేవలం రెండిటిలోనే గెలిచింది.