NTV Telugu Site icon

Ind vs WI: ఉత్కంఠ పోరులో భారత్ పరాజయం

West Indies

West Indies

IND vs WI: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ సేనకు గట్టి షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. వెస్టిండీస్‌ జట్టు నిర్దేశించి 150 పరుగులు ఛేదించలేక 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్ జట్టు 1-0తో ముందంజలో నిలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. విండీస్‌ బ్యాటర్లలో నికోలస్‌ పూరన్ 41 పరుగులు, రోవ్‌మన్ పావెల్ 48 పరుగులు, బ్రాండన్ కింగ్ 28 పరుగులతో రాణించారు. భారత బౌలర్లు కూడా చాలా వరకు పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్‌ స్కోరును అదుపు చేయగలిగారు.

Also Read: IND vs WI: రాణించిన పూరన్, పావెల్.. భారత లక్ష్యం@150

అనంతరం పరుగుల ఛేదనకు దిగిన టీమిండియా బ్యాటర్లు.. విండీస్‌ బౌలర్ల ధాటికి కాస్త తడబడ్డారు. మొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాడు తిలక్‌ వర్మ 39 పరుగులతో మెరుపులు మెరిపించాడు. కానీ ఫెపర్డ్ వేసిన 11వ ఓవర్‌ చివరి బంతికి హెట్‌మేయర్‌కు చిక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 21, హార్దిక్ పాండ్యా 19 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో మెక్‌కాయ్, హోల్డర్‌, షెపర్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హోసేన్ ఒక వికెట్‌ తీశాడు.

Show comments