వెస్టిండీస్ టీంలోని ఓ స్టార్ క్రికెటర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. గత వారం గయానాకు చెందిన కైటూర్ న్యూస్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక టీనేజర్‌తో సహా 11 మంది మహిళలు ఆ క్రికెటర్‌పై లైంగిక నేరాల ఆరోపణలు చేశారు. ఈ అభియోగాలపై ఇంకా కేసు నమోదు కాలేదు. తాజాగా జట్టు ప్రధాన కోచ్ డారెన్ సామీ దీనిపై స్పందించారు. బాధితులకు న్యాయం జరగాలని పిలుపునిచ్చారు.
READ MORE: Fake Website: డబ్బుల కోసం ఎంతకు తెగించార్రా.. స్వామి పేరుతో నకిలీ వెబ్ సైట్
ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన సామీ.. “దీని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. కానీ మీడియాలో ఏమి జరుగుతుందో మనందరికీ తెలుసు. నేను నా ఆటగాళ్లకు చాలా దగ్గరగా ఉంటాను. నేను వారితో సంభాషణలు జరిపాను. వారి మానసిక స్థితి బాగానే ఉండేలా నిరంతరం వారితో మాట్లాడుతున్నాను. ఇవి ఆరోపణలు మాత్రమే. మాకు న్యాయ వ్యవస్థ గురించి తెలుసు. ప్రాసెస్ పూర్తి అయ్యే వరకు మీరు వేచి ఉండాలి. నేను న్యాయమూర్తిని కాదు, నేను ప్రాసిక్యూటర్‌నూ కాదు. మీడియాలో వచ్చిన సమాచారం మాత్రమే నాకు తెలుసు. చివరికి న్యాయం జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నారు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Anirudh Reddy: చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారు.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్!
కాగా.. 2023 మార్చిలో న్యూఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని ఓ నివాసంలో ఆ క్రికెటర్ తనపై లైంగిక దాడి చేశాడని 18 ఏళ్ల యువతితో పాటు ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో మరికొందరు మహిళలు కూడా ఆ క్రికెటర్‌పై ఇవే ఆరోపణలు చేశారు. క్రికెటర్ చేసిన వాట్సాప్ సందేశాలు, వాయిస్ నోట్స్ లాంటి ఆధారాలను పోలీసులకు అందజేశారు. కానీ, ఇప్పటిదాకా ఆ ఆటగాడిపై ఎలాంటి కేసూ నమోదు కాలేదు. గతేడాది జనవరిలో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో గెలిచిన విండీస్ జట్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్ ఉన్నాడని మీడియా వెల్లడించింది. నిందితుడైన క్రికెటర్ ఎవరనేది ఇంకా వెల్లడి కానప్పటికీ.. ఈ వివాదం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మార్క్యూ హోమ్ టెస్ట్ సిరీస్ మధ్యలో తీవ్ర కలకలం రేపింది.
