రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోమవారం కోల్‌కతాలో అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
Read Also: Supreme Court: ఆన్‌లైన్ రమ్మీపై నిషేధం వద్దని ఏపీ హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మరోవైపు గవర్నర్ సివి ఆనంద్ బోస్‌ను గురించి దీదీ మాట్లాడుతూ.. గవర్నర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు. తాను గవర్నర్ పదవిని గౌరవిస్తాను, కానీ అతని రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వనని పేర్కొన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) పాలనను అంతం చేశామని చెప్పారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనే టార్గెట్ అని.. ఓడిస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను బుక్ చేసిందని ఆరోపించారు. తద్వారా ఇతర రాజకీయ పార్టీలు వాటిని ప్రచారానికి ఉపయోగించలేవని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
Read Also: Aditya-L1 Mission: ఆదిత్య ఎల్ 1 మిషన్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన ఇస్రో.. సెప్టెంబర్ 2న ప్రయోగం..
మొన్న కోల్కతా సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది చనిపోగా.. కొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కొందరు పోలీసుల మద్దతుతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారిని వదిలిపెట్టేది లేదు.. చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు జాదవ్‌పూర్ యూనివర్శిటీలో అల్లర్ల ఘటనపై కూడా స్పందించారు. కొందరు ‘గోలీ మారో’ అంటూ నినాదాలు చేసారని.. వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు.