NTV Telugu Site icon

Mamata Banerjee: బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే..

Mamatha Benarjee

Mamatha Benarjee

కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్(UC)పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ మఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు 52 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ యూసీలను ఇప్పటి వరకు సమర్పించలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ఉత్తర మాల్దా లోక్ సభ పరిధిలోని హరిశ్చంద్రపూర్ లో దీదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Read Also: AP Elections 2024: నందమూరి బ్రదర్స్‌.. నేటి నుంచి రామకృష్ణ ప్రచారం.. రేపటి నుంచి బాలయ్య ఉత్తరాంధ్ర టూర్‌

ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ..మా ప్రభుత్వం 2.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసి వాటికి సంబంధించిన యూసీలను సమర్పించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ సభలో ఆరోపించారు.. దానిని నిరూపించాలని నేను సవాల్ చేస్తున్నాను అని ఆమె డిమాండ్ చేశారు. ఇదంతా అసత్య ప్రచారం.. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి యూసీని సమర్పించామన్నారు. అంతకు ముందు సీపీఎం పాలనలో జరిగిన వాటికి మాత్రం నేను బాధ్యత వహించను అని ముఖ్యమంత్రి మమతా తెలిపారు.

Read Also: Siddharth Roy OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సిద్దార్థ రాయ్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కాగా, ఉపాధి హామీ పనికి సంబంధించిన నిధులను నిలిపి వేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్రం ముందు తాము ఎప్పటికీ తలవంచబోనని చెప్పారు. బెంగాల్​లో ఎన్​ఆర్​సీ, యునిఫాం సివిల్ కోడ్ (ucc) బిల్లులను అమలు చేయబోమని మమతా బెనర్జీ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.