West Bengal: బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేపై దాడి.. రక్తం కళ్ల జూసిన నిరసనకారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: ఉత్తర బెంగాల్‌లోని నాగరకటలో వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్, ఎంపీ ఖాగెన్ ముర్ముపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బీజేపీ నాయకులు స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కుట్రగా బీజేపీ అభివర్ణిస్తోంది. ఈ ఘటన జల్పాయీగూడీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది.
READ MORE: Vijay Deverakonda: మొన్ననే ఎంగేజ్మెంట్.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ..!
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడటంతో జల్పైగురి ప్రాంతం అతలాకుతలమైంది. దీంతో సోమవారం నార్త్ మాల్దా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము, స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్, బీజేపీ ప్రతినిధుల బృందం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించింది. బాధితులకు సహాయసామగ్రి పంపిణీ చేస్తున్నారు. కొందరు స్థానికులు వీరిపైకి రాళ్లు విసిరారు. ఈక్రమంలోనే ఖాగెన్ ముర్ము తలకు బలమైన దెబ్బలు తగిలి.. ధారాళంగా రక్తం కారింది. ఆయన ధరించిన కుర్తా సైతం రక్తంతో తడిసి ముద్దైంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున జనాలు మారణాయుధాలతో బీజేపీ నేతలపై దాడికి తెగబడినట్లు వీడియోలో రికార్డైంది. వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. వారిని బయపెట్టేందుకు ఎంపీ ఖాగెన్ ముర్ముపై రాళ్లు, చెప్పులు, కర్రలు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు.
విషయం గుర్తించిన పలువురు స్థానికులు, ఎంపీ వెంట ఉన్న నాయకులు.. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి ముందు బీజేపీ ప్రతినిధులను అడ్డుకునేందుకు 500 మందికిపైగా స్థానికులు రహదారులపై బైటాయించారు. ‘గో బ్యాక్’ అనే నినాదాలతో బీజేపీ బృందాన్ని అడ్డుకున్నారు. ఈ దాడిలో గాయపడిన ఎంపీ, ఎమ్మెల్యేలను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే.. ఈదాడిపై బీజేపీ స్పందించింది. పార్టీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్టు చేశారు. బెంగాల్లో తృణమూల్ ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
BJP MP Khagen Murmu (Malda Uttar PC) and BJP MLA Shankar Ghosh (Siliguri AC) attacked in Nagrakata in Jalpaiguri.
This seems to be a case of public outrage against BJP leaders of North Bengal who prioritize accompanying LOP Suvendu Adhikari over attending to their areas. pic.twitter.com/Rf5vnPGdlK
— Sandipan Mitra (@SMitra_) October 6, 2025
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?