Site icon NTV Telugu

MS DHONI: అభిమానానికి హద్దులు లేదంటే ఇదేనేమో.. వెడ్డింగ్ కార్డుపై ఎంఎస్ ధోని ఫోటో..

Wedding Card

Wedding Card

టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. వారిలో ఒక వీరాభిమాని తన పెళ్లికార్డులో ధోనీ ఫోటో వేసుకున్నాడు. అమితమైన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Devara: మళ్లీ యుద్ధం మొదలు పెట్టనున్న టైగర్…

మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అసాధారణమైన వికెట్ కీపింగ్ నైపుణ్యంతో పాటు ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా ఆరాధించబడుతూ ధోనీ అభిమానుల మనసు కొల్లగొట్టాడు. అయితే ఎంఎస్ ధోనీ అభిమాని ఒకరు అతనిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లాలోని తమ్నార్‌కి చెందిన దీపక్‌కి ధోనీ అంటే విపరీతమైన అభిమానం. ఎంతగా అంటే తన పెళ్లికార్డులో రెండువైపుల ధోనీ ఫోటోని వేయించుకున్నాడు. తలా అనే పదం వెడ్డింగ్ కార్డ్‌ పై కూడా రాయించుకున్నాడు.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్

అయితే దీపక్‌కి చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం.. ధోనిని ఆదర్శంగా తీసుకునేవాడు. క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో తన గ్రామంలో క్రికెట్ టీమ్‌కు బాధ్యతలు స్వీకరించాడు. తన జట్టుని అనేకసార్లు గెలిపించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఎంఎస్ ధోనీ వల్ల ప్రభావితమై అతనిలాగే వ్యూహాలే రచించాను అని దీపక్ అన్నాడు. ధోనీ మీద తన అభిమానం చాటుకోవడానికి తన పెళ్లి సరైన వేదిక అనుకున్నాడు.. అందుకే వెడ్డింగ్ కార్డుపై ఎంఎస్ ధోని ఫోటోను ముద్రించాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Katakam Sudarshan: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

అతని కాబోయే భార్య గరీమాతో పెళ్లికి సంబంధించిన వివరాలతో పాటు ధోనీ ఐకానిక్ జెర్సీ నంబర్ 7.. అతని ఫోటోను తన పెళ్లి కార్డుపై వేయించుకున్నాడు. జీవితంలో ముఖ్యమైన వివాహ వేడుకల్లో తను ఎంతగానో అభిమానించే ధోనీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే దీపక్.. ధోనిపై ఎంత అభిమానం పెంచుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version