Site icon NTV Telugu

Wrestlers : ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చేస్తాం.. ఇండియన్ రెజ్లర్స్ కీలక నిర్ణయం..

Reglrs

Reglrs

భారత్ లో గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వానికి, పెద్దలకు విజ్ఞప్తులు చేసిన భారత రెజ్లర్లు ఇక వార్నింగ్ లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌ను మే 21లోగా అరెస్టు చేయకపోతే ఈ ఆందోళనలను ప్రపంచ వ్యాప్తంగా చేస్తామని హెచ్చరిస్తున్నారు. మైనర్‌తో సహా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని బ్రిజ్ భూషణ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Also Read : SRH vs GT: చితక్కొడుతున్న జీటీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

వెంటనే బ్రిజ్ భూషణ్‌ ను అరెస్టు చేయాలని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు గత 23 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ నిరసనను ప్రపంచ వ్యాప్తం చేస్తాం. ఇతర దేశాల ఒలింపియన్లు, పతక విజేతలను సంప్రదిస్తాం అంటూ పేర్కొన్నారు. వారి మద్దతు కోరుతూ లేఖ రాస్తాం అని రెజ్లర్లు తెలిపాడు. మా నిరసనను భగ్నం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అని రెజ్లర్లు పేర్కొన్నారు. మా ఆందోళన ఆరంభంలో ఇది జరిగింది.. మమ్మల్ని వెంబడిస్తున్నారు. రికార్డ్ చేస్తున్నారు. ఫోటోలు తీస్తున్నారు.. వద్దన్నా వినడం లేదు అని భారత రెజ్లర్లు వెల్లడించారు.

Also Read : DK Siva Kumar : కాంగ్రెస్ హైకమాండ్ కు డీకే శివ కుమార్ గట్టి సంకేతాలు

కొంత మంది గుర్తు తెలియని మహిళలు ఇక్కడ టెంట్ లోపల నిద్రించడనికి ప్రయత్నించారు. మాకు తెలియని స్త్రీలను రాత్రిపూట లోపలికి పంపుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు. ఏదైనా జరిగితే న్యాయం కోసం పోరాడుతున్న మా ఉద్యమానికి చెడ్డ పేరు వస్తుంది అని వినేష్ పొగట్ చెప్పుకొచ్చారు. రెజ్లర్లు నిరసన స్థలానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని ప్రతి పౌరునికి తమ కష్టాలను తెలియజేసే ప్రయత్నం చేస్తారని ఆమె వెల్లడించింది.

Exit mobile version