Site icon NTV Telugu

Salman Khan : సల్మాన్ ను చంపేస్తాం.. బహిరంగ హెచ్చరిక

Salman Khan

Salman Khan

Salman Khan : ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని వరుస బెదిరింపులు వస్తున్నాయి. కెనడాకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్.. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బహింరంగంగానే హెచ్చరికలు జారీచేశాడు. ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గోల్డీ బ్రార్ ఈ హెచ్చరికలు చేశారు. సల్మాన్‌ను చంపేస్తామని అతని అనుచరులు ఈమెయిల్ ద్వారా పలుమార్లు హెచ్చరిస్తున్నారు. మేలో పంజాబీ గాయకుడు-రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య వెనుక గోల్డీ బ్రార్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also:No Work No Pay: ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్‌ సర్కారు కొత్త నిబంధన!

“మేము తప్పకుండా అతనిని (సల్మాన్ ఖాన్) చంపుతాం. మేం అతనిని ఖచ్చితంగా చంపుతాం. భాయ్ సాబ్ (లారెన్స్) అతను క్షమించనని నిర్ణయించుకున్నాడు. బాబా దయతో ఉంటే, అతను దయతో ఉంటాడని బ్రార్ చెప్పారు. సల్మాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లారెన్స్ బిష్ణోయ్ జైలులో చెప్పిన మాటలను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు కూడా చేశాడు. “సల్మాన్ ఖాన్ మాత్రమే శత్రువు కాదు. మనం జీవించి ఉన్నంత కాలం మన శత్రువులందరిపై దాడి చేస్తూనే ఉంటాం. మా మొదటి టార్గెట్ సల్మాన్ ఖాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. పోరాడుతూనే ఉంటాం. “మేం గెలిచినప్పుడు మీకు తెలుస్తుంది” అని బ్రార్ నొక్కి చెప్పాడు.

Read Also:Hyderabad Traffic: బక్రీద్ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ ఏరియాకు వెళ్లొద్దు

Exit mobile version