Site icon NTV Telugu

Minister Satya Kumar: ప్రభుత్వ ఆస్పత్రిల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాం..

Satya Kumar

Satya Kumar

Minister Satya Kumar: నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు ఆసుపత్రికి ఆరు డయాలసిస్ యూనిట్లు లయన్స్ క్లబ్ ఇవ్వడం ఆనందంగా ఉంది.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాం.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. దేశంలో 3కోట్ల 40 లక్షల మంది మూత్ర పిండ వ్యాధి తో బాధ పడుతున్నారు అని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.

Read Also: Jagga Reddy: నేటి పాలకులు కులం,మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు

కాగా, దాతలు ముందుకు వచ్చి మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వానికి అండగా నిలవడం ఆనందంగా ఉంది అని మంత్రి సత్య కుమార్ తెలిపారు. గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసింది.. సెక్యూరిటీ, శానిటైజేషన్ లో అవకతవకలకు పాల్పడ్డారు.. నాసిరకం మద్యంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యారు.. రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తామన్నారు.

Exit mobile version