NTV Telugu Site icon

Ponnam Prabhakar: బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా గెలిచాం

New Project (19)

New Project (19)

బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా తాము గెలిచామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సారి చెప్తున్నాం.. గెలుపు ఓటములు సహజమన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ నీ ముందంజలో ఉండేలా ప్రతి కార్యకర్తలతో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్ పక్షాన బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. దేవుడి పేరు చెప్పి అక్షింతలు పంచి గెలవడం కాదని.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. దేవుడి పేరు మీద ఓట్లు వేసిన వాళ్ళు పునరాలోచించాలని పిలుపునిచ్చారు.

READ MORE: Pawan Kalyan Win: పవన్‌కు విజయ తిలకం పెట్టిన భార్య కొణిదెల అనా.. పక్కనే అకిరా నందన్..

అయోధ్య లో బీజేపీ ఓడిపోయిందని.. వారణాసిలో లో మోడీ హవా 50 శాతం పడిపోయిందన్నారు. కరీంనగర్ లో వినోద్ కుమార్ పీడ ఇక పోయినట్లే అని విమర్శించారు. బండి సంజయ్ కాల యాపన చేయకుండా ప్రజలకు సేవ చెయ్యాలని చెప్పారు. మతపరమైన మాటలు మాని అభివృద్ధి కోసం పాటు పడాలన్నారు. కాంగ్రెస్ లేదు అన్న పార్టీలకు మనం గుణపాఠం చెప్పామని తెలిపారు. హుస్నాబాద్ ప్రజలు 22 వేలా ఓట్లు వేశారని.. వారికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో నరేంద్ర మోడీ గాలి తగ్గింది అనడానికి ఎన్నికలు నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో సర్వేలు టీవీలలో ఇండియా కూటమికి అసలు సీట్లే రావు అన్నట్టుగా ప్రచారం చేసారని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈడీని ఉపయోగించుకొని కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్టు చేసిన రాజ్యాంగం పైన నమ్మకంతో ఇండియా కూటమిని ఇంత పెద్దగా ఆదరణ చూపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు జరిగిన ఈ ఎన్నికల్లో నియంతృత్వ పాలనను అంతమోందించేందుకు ప్రజలు దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించారని మండిపడ్డారు.