Site icon NTV Telugu

WCL 2025: మొదటి మ్యాచ్ లోనే తడపడ్డ ఇంగ్లాండ్‌.. 5 పరుగుల తేడాతో ఓటమి..!

England Champions Vs Pakistan Champions

England Champions Vs Pakistan Champions

WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీలో మొదటి మ్యాచ్ లోనే పరాభవం తప్పలేదు. బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా (శుక్రవారం) జులై 18న జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్తాన్ చాంపియన్స్ జట్టు ఇంగ్లాండ్‌పై 5 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరఫున మాజి కెప్టెన్ షాహిద్ అఫ్రీది గైర్హాజరులోనే విజయాన్ని సాధించడం విశేషం. దీనితో జూలై 20న భారత్‌తో జరగబోయే హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీం ఇండియాకు గట్టి వార్నింగ్‌ బెల్స్ ఇచ్చినట్లు అయ్యింది.

Pakistan: పాక్ కు మండుతున్నట్టుంది.. భారత్ అమెరికాను రెచ్చగొడుతోందంటూ..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ప్రారంభంలో కాస్త తడబడినా, కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ అర్థశతకంతో నిలిచాడు. టాప్ ఆర్డర్‌లో కామ్రాన్ అక్మల్ (8), శర్జీల్ ఖాన్ (12), షోయబ్ మాలిక్ (1) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే, హఫీజ్ 34 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. చివర్లో ఆమిర్ యామీన్ 13 బంతుల్లో 27 పరుగులు చేసి మ్యాచ్ మోమెంటాన్ని మార్చాడు. 19 ఓవర్ల వరకూ ఇంగ్లాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, చివరి ఓవర్‌లో మాత్రం పాక్ బ్యాటర్లు రెచ్చిపోయారు. జేమ్స్ విన్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో సోహైల్ ఖాన్ మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత మూడో, నాలుగో బంతులలో ఆమిర్ యామీన్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఫలితంగా పాక్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 చేసింది. ఇంగ్లాండ్ తరఫున ట్రెమ్లెట్, ప్లంకెట్ చెరో రెండు వికెట్లు తీయగా, మిగతా నలుగురు బౌలర్లు ఒక్కొక్క వికెట్ చొప్పున దక్కించుకున్నారు.

Fish Venkat : హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

ఇక ఇంగ్లాండ్ 161 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, జేమ్స్ విన్స్ తొందరగా అవుటయ్యారు. ఫిల్ మస్టర్డ్ ఓ వైపు నిలబడినా, అతడు నెమ్మదిగా 51 బంతులు ఎదురుకొని 58 పరుగుల చేయడంతో జట్టుకు భారంగా మారింది. అలాగే ఇక ఈ ఇన్నింగ్స్ లో ఇయాన్ బెల్ 51*(35 బంతులు), కెప్టెన్ మోర్గన్ 12* పరుగులు చేయగా మొత్తంగా ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమైనా సాధించలేకపోయింది. పాకిస్తాన్ తరఫున రుమాన్ రైస్, సోహైల్ తన్వీర్, ఆమిర్ యామీన్ చెరో వికెట్ తీసారు. ఈ విజయంతో పాకిస్థాన్ చాంపియన్స్ జట్టు విజయం ద్వారా మంచి ప్రారంభాన్ని అందుకుంది.

Exit mobile version