NTV Telugu Site icon

Parliament House: నూతన పార్లమెంట్ భావనంలో నీటి లీకేజీ..వీడియో వైరల్

Parliament House

Parliament House

తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొత్త పార్లమెంట్ భవనం లోపల నీటి లీకేజీ కనిపించింది. పై కప్పు నుంచి నీరు కారుతుండడం, పడే నీరు వ్యాపించకుండా నేలపై బకెట్లు ఏర్పాటు చేయడం వీడియోలో చూడొచ్చు.

READ MORE: Jupally Krishna Rao: కాంగ్రెస్ లోనే కృష్ణ మోహన్.. కేటీఆర్ ను కలిసింది అందుకే.. జూపల్లి క్లారిటీ

‘బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ…’
వీడియోను పోస్ట్ చేసిన ఎంపీ మాణికం ఠాగూర్.. “బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ. భవనం నిర్మాణం పూర్తయి.. ఒక సంవత్సరం అయ్యింది. లీకేజీ కారణంగా లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.” అని రాసుకొచ్చారు. ఇటీవలి నిర్మించిన పార్లమెంట్ లాబీలో నీటి లీకేజీ ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత వీడియోను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

READ MORE: Venkatesh: భార్య ఉండగా ప్రియురాలుతో వెంకీ మామ పోరాటం.. మ్యాటర్ ఏంటంటే..?

‘కొత్త పార్లమెంట్ కంటే..పాతదే బాగుండేది’
సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘ఈ కొత్త పార్లమెంట్‌ కంటే పాత పార్లమెంట్‌ బాగుందని పేర్కొన్నారు. పాత ఎంపీలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉందడేదని.. కోట్లాది రూపాయలతో నిర్మించిన పార్లమెంట్‌లో కనీసం లీకేజీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రతి కొత్త పైకప్పు నుంచి నీరు కారడం వారి ఆలోచనాత్మక రూపకల్పనలో భాగమా? అని ప్రజలు అడుగుతున్నారని అఖిలేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

READ MORE: Virat Kohli-Chokli: ‘చోక్లీ’ అంటూ కామెంట్‌ చేసిన శ్రీలంక ఫ్యాన్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!

ఢిల్లీలో మరోసారి వర్షం బీభత్సంగా మారింది. బుధవారం సాయంత్రం నుంచి ఢిల్లీలో ప్రారంభమైన వర్షాలు రాత్రిపూట కొనసాగాయి. ఆ తర్వాత ఢిల్లీలోని సరితా విహార్, దర్యాగంజ్, ప్రగతి మైదాన్ సహా అనేక ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీని ప్రభావం గురువారం ఉదయం కూడా కనిపించింది. ఈరోజు కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. గురువారం ఉదయం నుంచి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వర్షం కారణంగా ఢిల్లీలో ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.