Virat Kohli-Chokli: ‘చోక్లీ’ అంటూ కామెంట్ చేసిన శ్రీలంక ఫ్యాన్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!
- శ్రీలంకతో వన్డే సిరీస్
- గదిలో విరాట్ ప్రాక్టీస్
- చోక్లీ అని పిలిచిన శ్రీలంక ఫ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka Fan Called Virat Kohli as Chokli: శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్‌ను గెలిచిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్ధమవుతొంది. టీ20లకు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సోమవారం కొలొంబో చేరుకొని జట్టుతో కలిశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఈ ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. శుక్రవారం జరిగే మొదటి వన్డే కోసం రోహిత్, కోహ్లీలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొలంబోలో వర్షం కారణంగా బుధవారం భారత ప్రాక్టీస్ సెషన్ రద్దు చేయబడింది. విరాట్ కోహ్లీ మాత్రం ఓ గదిలో తన శిక్షణ కొనసాగించాడు. విరాట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ శ్రీలంక అభిమాని ‘చోక్లీ.. చోక్లీ’ అంటూ గట్టిగా అరిచాడు. ఇది విన్న కోహ్లీ అతడి వైపు చూసి.. నిరాశ వ్యక్తం చేశాడు. శ్రీలంక అభిమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. కోహ్లీని ‘చోక్లీ’గా పిలిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
Also Read: Anshuman Gaekwad Dies: టీమిండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత!
ప్రధాన మ్యాచ్‌లలో సరైన ప్రదర్శన చేయని ఆటగాళ్లను చోకర్‌గా పిలుస్తుంటారు. విరాట్ కోహ్లీని చోక్లీగా పిలవడంతో శ్రీలంక అభిమానిపై సోషల్ మీడియాలో భారత ఫాన్స్ మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేశాడని గుర్తు చేస్తున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కేవలం ఏడు నెలల సమయం ఉన్నందున విరాట్ మరో ఐసీసీ ట్రోఫీని లక్ష్యంగా తన అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. విరాట్ శ్రీలంకపై 53 వన్డేలు ఆడాడు. 63.26 సగటుతో 2594 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Original video of Virat Kohli
Stop spreading fake videos— CinemaCricketUniverse (@MoviesUniverse9) July 31, 2024
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!